الواقعة
Al-Waaqia
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِذَا وَقَعَتِ ٱلۡوَاقِعَةُ
Open ayah 56:1ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,
لَيۡسَ لِوَقۡعَتِهَا كَاذِبَةٌ
Open ayah 56:2అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.
خَافِضَةٞ رَّافِعَةٌ
Open ayah 56:3అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది
إِذَا رُجَّتِ ٱلۡأَرۡضُ رَجّٗا
Open ayah 56:4భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు;
وَبُسَّتِ ٱلۡجِبَالُ بَسّٗا
Open ayah 56:5మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు;
فَكَانَتۡ هَبَآءٗ مُّنۢبَثّٗا
Open ayah 56:6అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు;
وَكُنتُمۡ أَزۡوَٰجٗا ثَلَٰثَةٗ
Open ayah 56:7మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు.
فَأَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ
Open ayah 56:8ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)!
وَأَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ
Open ayah 56:9మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)!
وَٱلسَّٰبِقُونَ ٱلسَّٰبِقُونَ
Open ayah 56:10మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు.
أُوْلَٰٓئِكَ ٱلۡمُقَرَّبُونَ
Open ayah 56:11అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు.
فِي جَنَّٰتِ ٱلنَّعِيمِ
Open ayah 56:12వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు.
ثُلَّةٞ مِّنَ ٱلۡأَوَّلِينَ
Open ayah 56:13మొదటి తరాల వారిలో నుండి చాలా మంది;
وَقَلِيلٞ مِّنَ ٱلۡأٓخِرِينَ
Open ayah 56:14మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది.
عَلَىٰ سُرُرٖ مَّوۡضُونَةٖ
Open ayah 56:15(బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద;
مُّتَّكِـِٔينَ عَلَيۡهَا مُتَقَٰبِلِينَ
Open ayah 56:16ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.
يَطُوفُ عَلَيۡهِمۡ وِلۡدَٰنٞ مُّخَلَّدُونَ
Open ayah 56:17వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు.
بِأَكۡوَابٖ وَأَبَارِيقَ وَكَأۡسٖ مِّن مَّعِينٖ
Open ayah 56:18(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో!
لَّا يُصَدَّعُونَ عَنۡهَا وَلَا يُنزِفُونَ
Open ayah 56:19దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు.
وَفَٰكِهَةٖ مِّمَّا يَتَخَيَّرُونَ
Open ayah 56:20మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి.
وَلَحۡمِ طَيۡرٖ مِّمَّا يَشۡتَهُونَ
Open ayah 56:21మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.
وَحُورٌ عِينٞ
Open ayah 56:22మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్);
كَأَمۡثَٰلِ ٱللُّؤۡلُوِٕ ٱلۡمَكۡنُونِ
Open ayah 56:23దాచబడిన ముత్యాల వలే!
جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ
Open ayah 56:24ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా!
لَا يَسۡمَعُونَ فِيهَا لَغۡوٗا وَلَا تَأۡثِيمًا
Open ayah 56:25అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు.
إِلَّا قِيلٗا سَلَٰمٗا سَلَٰمٗا
Open ayah 56:26శాంతి (సలాం) శాంతి (సలాం)! అనే మాటలు తప్ప!
وَأَصۡحَٰبُ ٱلۡيَمِينِ مَآ أَصۡحَٰبُ ٱلۡيَمِينِ
Open ayah 56:27మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)!
فِي سِدۡرٖ مَّخۡضُودٖ
Open ayah 56:28వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య !
وَطَلۡحٖ مَّنضُودٖ
Open ayah 56:29మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు;
وَظِلّٖ مَّمۡدُودٖ
Open ayah 56:30మరియు వ్యాపించి ఉన్న నీడలు,
وَمَآءٖ مَّسۡكُوبٖ
Open ayah 56:31మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు;
وَفَٰكِهَةٖ كَثِيرَةٖ
Open ayah 56:32మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు;
لَّا مَقۡطُوعَةٖ وَلَا مَمۡنُوعَةٖ
Open ayah 56:33ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో);
وَفُرُشٖ مَّرۡفُوعَةٍ
Open ayah 56:34మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు.
إِنَّآ أَنشَأۡنَٰهُنَّ إِنشَآءٗ
Open ayah 56:35నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;
فَجَعَلۡنَٰهُنَّ أَبۡكَارًا
Open ayah 56:36మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;
عُرُبًا أَتۡرَابٗا
Open ayah 56:37వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు);
لِّأَصۡحَٰبِ ٱلۡيَمِينِ
Open ayah 56:38కుడిపక్షం వారి కొరకు.
ثُلَّةٞ مِّنَ ٱلۡأَوَّلِينَ
Open ayah 56:39అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు;
وَثُلَّةٞ مِّنَ ٱلۡأٓخِرِينَ
Open ayah 56:40మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు.
وَأَصۡحَٰبُ ٱلشِّمَالِ مَآ أَصۡحَٰبُ ٱلشِّمَالِ
Open ayah 56:41ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)?
فِي سَمُومٖ وَحَمِيمٖ
Open ayah 56:42వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో;
وَظِلّٖ مِّن يَحۡمُومٖ
Open ayah 56:43మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు).
لَّا بَارِدٖ وَلَا كَرِيمٍ
Open ayah 56:44అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు;
إِنَّهُمۡ كَانُواْ قَبۡلَ ذَٰلِكَ مُتۡرَفِينَ
Open ayah 56:45నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి;
وَكَانُواْ يُصِرُّونَ عَلَى ٱلۡحِنثِ ٱلۡعَظِيمِ
Open ayah 56:46మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి;
وَكَانُواْ يَقُولُونَ أَئِذَا مِتۡنَا وَكُنَّا تُرَابٗا وَعِظَٰمًا أَءِنَّا لَمَبۡعُوثُونَ
Open ayah 56:47మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా?
أَوَءَابَآؤُنَا ٱلۡأَوَّلُونَ
Open ayah 56:48మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?
قُلۡ إِنَّ ٱلۡأَوَّلِينَ وَٱلۡأٓخِرِينَ
Open ayah 56:49వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ!
لَمَجۡمُوعُونَ إِلَىٰ مِيقَٰتِ يَوۡمٖ مَّعۡلُومٖ
Open ayah 56:50వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు.
ثُمَّ إِنَّكُمۡ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلۡمُكَذِّبُونَ
Open ayah 56:51ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా!
لَأٓكِلُونَ مِن شَجَرٖ مِّن زَقُّومٖ
Open ayah 56:52మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు.
فَمَالِـُٔونَ مِنۡهَا ٱلۡبُطُونَ
Open ayah 56:53దానితో కడుపులు నింపుకుంటారు.
فَشَٰرِبُونَ عَلَيۡهِ مِنَ ٱلۡحَمِيمِ
Open ayah 56:54తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు.
فَشَٰرِبُونَ شُرۡبَ ٱلۡهِيمِ
Open ayah 56:55వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు.
هَٰذَا نُزُلُهُمۡ يَوۡمَ ٱلدِّينِ
Open ayah 56:56తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే!
نَحۡنُ خَلَقۡنَٰكُمۡ فَلَوۡلَا تُصَدِّقُونَ
Open ayah 56:57మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు?
أَفَرَءَيۡتُم مَّا تُمۡنُونَ
Open ayah 56:58ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?
ءَأَنتُمۡ تَخۡلُقُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلۡخَٰلِقُونَ
Open ayah 56:59ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము?
نَحۡنُ قَدَّرۡنَا بَيۡنَكُمُ ٱلۡمَوۡتَ وَمَا نَحۡنُ بِمَسۡبُوقِينَ
Open ayah 56:60మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;
عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمۡثَٰلَكُمۡ وَنُنشِئَكُمۡ فِي مَا لَا تَعۡلَمُونَ
Open ayah 56:61మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.
وَلَقَدۡ عَلِمۡتُمُ ٱلنَّشۡأَةَ ٱلۡأُولَىٰ فَلَوۡلَا تَذَكَّرُونَ
Open ayah 56:62మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?
أَفَرَءَيۡتُم مَّا تَحۡرُثُونَ
Open ayah 56:63మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?
ءَأَنتُمۡ تَزۡرَعُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلزَّٰرِعُونَ
Open ayah 56:64మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము?
لَوۡ نَشَآءُ لَجَعَلۡنَٰهُ حُطَٰمٗا فَظَلۡتُمۡ تَفَكَّهُونَ
Open ayah 56:65మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు."
إِنَّا لَمُغۡرَمُونَ
Open ayah 56:66(మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము!
بَلۡ نَحۡنُ مَحۡرُومُونَ
Open ayah 56:67కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని.
أَفَرَءَيۡتُمُ ٱلۡمَآءَ ٱلَّذِي تَشۡرَبُونَ
Open ayah 56:68ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా?
ءَأَنتُمۡ أَنزَلۡتُمُوهُ مِنَ ٱلۡمُزۡنِ أَمۡ نَحۡنُ ٱلۡمُنزِلُونَ
Open ayah 56:69మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము?
لَوۡ نَشَآءُ جَعَلۡنَٰهُ أُجَاجٗا فَلَوۡلَا تَشۡكُرُونَ
Open ayah 56:70మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు?
أَفَرَءَيۡتُمُ ٱلنَّارَ ٱلَّتِي تُورُونَ
Open ayah 56:71మీరు రాజేసే అగ్నిని గమనించారా?
ءَأَنتُمۡ أَنشَأۡتُمۡ شَجَرَتَهَآ أَمۡ نَحۡنُ ٱلۡمُنشِـُٔونَ
Open ayah 56:72దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?
نَحۡنُ جَعَلۡنَٰهَا تَذۡكِرَةٗ وَمَتَٰعٗا لِّلۡمُقۡوِينَ
Open ayah 56:73మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.
فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ
Open ayah 56:74కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.
۞فَلَآ أُقۡسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ
Open ayah 56:75ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను.
وَإِنَّهُۥ لَقَسَمٞ لَّوۡ تَعۡلَمُونَ عَظِيمٌ
Open ayah 56:76మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది!
إِنَّهُۥ لَقُرۡءَانٞ كَرِيمٞ
Open ayah 56:77నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది.
فِي كِتَٰبٖ مَّكۡنُونٖ
Open ayah 56:78సురక్షితమైన గ్రంథంలో ఉన్నది.
لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلۡمُطَهَّرُونَ
Open ayah 56:79దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.
تَنزِيلٞ مِّن رَّبِّ ٱلۡعَٰلَمِينَ
Open ayah 56:80ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది.
أَفَبِهَٰذَا ٱلۡحَدِيثِ أَنتُم مُّدۡهِنُونَ
Open ayah 56:81ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా?
وَتَجۡعَلُونَ رِزۡقَكُمۡ أَنَّكُمۡ تُكَذِّبُونَ
Open ayah 56:82మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా?
فَلَوۡلَآ إِذَا بَلَغَتِ ٱلۡحُلۡقُومَ
Open ayah 56:83అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)?
وَأَنتُمۡ حِينَئِذٖ تَنظُرُونَ
Open ayah 56:84మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు.
وَنَحۡنُ أَقۡرَبُ إِلَيۡهِ مِنكُمۡ وَلَٰكِن لَّا تُبۡصِرُونَ
Open ayah 56:85మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు.
فَلَوۡلَآ إِن كُنتُمۡ غَيۡرَ مَدِينِينَ
Open ayah 56:86ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే;
تَرۡجِعُونَهَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ
Open ayah 56:87మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు?
فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُقَرَّبِينَ
Open ayah 56:88కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే!
فَرَوۡحٞ وَرَيۡحَانٞ وَجَنَّتُ نَعِيمٖ
Open ayah 56:89అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి.
وَأَمَّآ إِن كَانَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ
Open ayah 56:90మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో!
فَسَلَٰمٞ لَّكَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ
Open ayah 56:91అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది).
وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ
Open ayah 56:92మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో!
فَنُزُلٞ مِّنۡ حَمِيمٖ
Open ayah 56:93అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది.
وَتَصۡلِيَةُ جَحِيمٍ
Open ayah 56:94మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది.
إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ ٱلۡيَقِينِ
Open ayah 56:95నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం!
فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ
Open ayah 56:96కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.