المدثر
Al-Muddaththir
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
يَٰٓأَيُّهَا ٱلۡمُدَّثِّرُ
Open ayah 74:1ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!
قُمۡ فَأَنذِرۡ
Open ayah 74:2లే! ఇక హెచ్చరించు!
وَرَبَّكَ فَكَبِّرۡ
Open ayah 74:3మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)!
وَثِيَابَكَ فَطَهِّرۡ
Open ayah 74:4మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!
وَٱلرُّجۡزَ فَٱهۡجُرۡ
Open ayah 74:5మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!
وَلَا تَمۡنُن تَسۡتَكۡثِرُ
Open ayah 74:6మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!
وَلِرَبِّكَ فَٱصۡبِرۡ
Open ayah 74:7మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు!
فَإِذَا نُقِرَ فِي ٱلنَّاقُورِ
Open ayah 74:8మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు;
فَذَٰلِكَ يَوۡمَئِذٖ يَوۡمٌ عَسِيرٌ
Open ayah 74:9ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది;
عَلَى ٱلۡكَٰفِرِينَ غَيۡرُ يَسِيرٖ
Open ayah 74:10సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు.
ذَرۡنِي وَمَنۡ خَلَقۡتُ وَحِيدٗا
Open ayah 74:11వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ!
وَجَعَلۡتُ لَهُۥ مَالٗا مَّمۡدُودٗا
Open ayah 74:12మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను.
وَبَنِينَ شُهُودٗا
Open ayah 74:13మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను!
وَمَهَّدتُّ لَهُۥ تَمۡهِيدٗا
Open ayah 74:14మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను.
ثُمَّ يَطۡمَعُ أَنۡ أَزِيدَ
Open ayah 74:15అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు.
كَلَّآۖ إِنَّهُۥ كَانَ لِأٓيَٰتِنَا عَنِيدٗا
Open ayah 74:16అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు.
سَأُرۡهِقُهُۥ صَعُودًا
Open ayah 74:17నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను!
إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ
Open ayah 74:18వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు.
فَقُتِلَ كَيۡفَ قَدَّرَ
Open ayah 74:19కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి!
ثُمَّ قُتِلَ كَيۡفَ قَدَّرَ
Open ayah 74:20అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి!
ثُمَّ نَظَرَ
Open ayah 74:21అప్పుడు అతడు ఆలోచించాడు.
ثُمَّ عَبَسَ وَبَسَرَ
Open ayah 74:22తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);
ثُمَّ أَدۡبَرَ وَٱسۡتَكۡبَرَ
Open ayah 74:23తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు.
فَقَالَ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ يُؤۡثَرُ
Open ayah 74:24అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే!
إِنۡ هَٰذَآ إِلَّا قَوۡلُ ٱلۡبَشَرِ
Open ayah 74:25ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే
سَأُصۡلِيهِ سَقَرَ
Open ayah 74:26త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను.
وَمَآ أَدۡرَىٰكَ مَا سَقَرُ
Open ayah 74:27మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు?
لَا تُبۡقِي وَلَا تَذَرُ
Open ayah 74:28అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు.
لَوَّاحَةٞ لِّلۡبَشَرِ
Open ayah 74:29అది మానవుణ్ణి (అతడి చర్మాన్ని0 దహించి వేస్తుంది.
عَلَيۡهَا تِسۡعَةَ عَشَرَ
Open ayah 74:30దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు.
وَمَا جَعَلۡنَآ أَصۡحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةٗۖ وَمَا جَعَلۡنَا عِدَّتَهُمۡ إِلَّا فِتۡنَةٗ لِّلَّذِينَ كَفَرُواْ لِيَسۡتَيۡقِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَيَزۡدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِيمَٰنٗا وَلَا يَرۡتَابَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡمُؤۡمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ وَٱلۡكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ
Open ayah 74:31మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.
كَلَّا وَٱلۡقَمَرِ
Open ayah 74:32అలా కాదు! చంద్రుని సాక్షిగా!
وَٱلَّيۡلِ إِذۡ أَدۡبَرَ
Open ayah 74:33గడిచిపోయే రాత్రి సాక్షిగా!
وَٱلصُّبۡحِ إِذَآ أَسۡفَرَ
Open ayah 74:34ప్రకాశించే, ఉదయం సాక్షిగా!
إِنَّهَا لَإِحۡدَى ٱلۡكُبَرِ
Open ayah 74:35నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం.
نَذِيرٗا لِّلۡبَشَرِ
Open ayah 74:36మానవునికి ఒక హెచ్చరిక;
لِمَن شَآءَ مِنكُمۡ أَن يَتَقَدَّمَ أَوۡ يَتَأَخَّرَ
Open ayah 74:37మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి;
كُلُّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡ رَهِينَةٌ
Open ayah 74:38ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు.
إِلَّآ أَصۡحَٰبَ ٱلۡيَمِينِ
Open ayah 74:39కుడిపక్షం వారు తప్ప!
فِي جَنَّٰتٖ يَتَسَآءَلُونَ
Open ayah 74:40వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు!
عَنِ ٱلۡمُجۡرِمِينَ
Open ayah 74:41అపరాధులను గురించి (మరియు వారితో అంటారు):
مَا سَلَكَكُمۡ فِي سَقَرَ
Open ayah 74:42మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?
قَالُواْ لَمۡ نَكُ مِنَ ٱلۡمُصَلِّينَ
Open ayah 74:43వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.
وَلَمۡ نَكُ نُطۡعِمُ ٱلۡمِسۡكِينَ
Open ayah 74:44మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము;
وَكُنَّا نَخُوضُ مَعَ ٱلۡخَآئِضِينَ
Open ayah 74:45మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;
وَكُنَّا نُكَذِّبُ بِيَوۡمِ ٱلدِّينِ
Open ayah 74:46మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము;
حَتَّىٰٓ أَتَىٰنَا ٱلۡيَقِينُ
Open ayah 74:47చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది.
فَمَا تَنفَعُهُمۡ شَفَٰعَةُ ٱلشَّٰفِعِينَ
Open ayah 74:48అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు.
فَمَا لَهُمۡ عَنِ ٱلتَّذۡكِرَةِ مُعۡرِضِينَ
Open ayah 74:49అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.
كَأَنَّهُمۡ حُمُرٞ مُّسۡتَنفِرَةٞ
Open ayah 74:50వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది;
فَرَّتۡ مِن قَسۡوَرَةِۭ
Open ayah 74:51సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)!
بَلۡ يُرِيدُ كُلُّ ٱمۡرِيٕٖ مِّنۡهُمۡ أَن يُؤۡتَىٰ صُحُفٗا مُّنَشَّرَةٗ
Open ayah 74:52అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు.
كَلَّاۖ بَل لَّا يَخَافُونَ ٱلۡأٓخِرَةَ
Open ayah 74:53కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు.
كَلَّآ إِنَّهُۥ تَذۡكِرَةٞ
Open ayah 74:54అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం.
فَمَن شَآءَ ذَكَرَهُۥ
Open ayah 74:55కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు.
وَمَا يَذۡكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُۚ هُوَ أَهۡلُ ٱلتَّقۡوَىٰ وَأَهۡلُ ٱلۡمَغۡفِرَةِ
Open ayah 74:56కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు.