عبس
Abasa
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
عَبَسَ وَتَوَلَّىٰٓ
Open ayah 80:1అతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు;
أَن جَآءَهُ ٱلۡأَعۡمَىٰ
Open ayah 80:2ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని!
وَمَا يُدۡرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ
Open ayah 80:3కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు!
أَوۡ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكۡرَىٰٓ
Open ayah 80:4లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు!
أَمَّا مَنِ ٱسۡتَغۡنَىٰ
Open ayah 80:5కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో!
فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ
Open ayah 80:6అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.
وَمَا عَلَيۡكَ أَلَّا يَزَّكَّىٰ
Open ayah 80:7ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది?
وَأَمَّا مَن جَآءَكَ يَسۡعَىٰ
Open ayah 80:8కాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో!
وَهُوَ يَخۡشَىٰ
Open ayah 80:9మరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో!
فَأَنتَ عَنۡهُ تَلَهَّىٰ
Open ayah 80:10అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు.
كَلَّآ إِنَّهَا تَذۡكِرَةٞ
Open ayah 80:11అలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం.
فَمَن شَآءَ ذَكَرَهُۥ
Open ayah 80:12కావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు!
فِي صُحُفٖ مُّكَرَّمَةٖ
Open ayah 80:13ఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది);
مَّرۡفُوعَةٖ مُّطَهَّرَةِۭ
Open ayah 80:14మహోన్నతమైనది, పవిత్రమైనది;
بِأَيۡدِي سَفَرَةٖ
Open ayah 80:15లేఖకుల (దేవదూతల) చేతులలో;
كِرَامِۭ بَرَرَةٖ
Open ayah 80:16వారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు).
قُتِلَ ٱلۡإِنسَٰنُ مَآ أَكۡفَرَهُۥ
Open ayah 80:17మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు!
مِنۡ أَيِّ شَيۡءٍ خَلَقَهُۥ
Open ayah 80:18ఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు?
مِن نُّطۡفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ
Open ayah 80:19అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు.
ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ
Open ayah 80:20ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు;
ثُمَّ أَمَاتَهُۥ فَأَقۡبَرَهُۥ
Open ayah 80:21ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు;
ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ
Open ayah 80:22మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు.
كَلَّا لَمَّا يَقۡضِ مَآ أَمَرَهُۥ
Open ayah 80:23అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు.
فَلۡيَنظُرِ ٱلۡإِنسَٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ
Open ayah 80:24ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి!
أَنَّا صَبَبۡنَا ٱلۡمَآءَ صَبّٗا
Open ayah 80:25నిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము.
ثُمَّ شَقَقۡنَا ٱلۡأَرۡضَ شَقّٗا
Open ayah 80:26ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో!
فَأَنۢبَتۡنَا فِيهَا حَبّٗا
Open ayah 80:27తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము;
وَعِنَبٗا وَقَضۡبٗا
Open ayah 80:28మరియు ద్రాక్షలను మరియు కూరగాయలను;
وَزَيۡتُونٗا وَنَخۡلٗا
Open ayah 80:29మరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను;
وَحَدَآئِقَ غُلۡبٗا
Open ayah 80:30మరియు దట్టమైన తోటలను;
وَفَٰكِهَةٗ وَأَبّٗا
Open ayah 80:31మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను;
مَّتَٰعٗا لَّكُمۡ وَلِأَنۡعَٰمِكُمۡ
Open ayah 80:32మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా!
فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ
Open ayah 80:33ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో!
يَوۡمَ يَفِرُّ ٱلۡمَرۡءُ مِنۡ أَخِيهِ
Open ayah 80:34ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు;
وَأُمِّهِۦ وَأَبِيهِ
Open ayah 80:35మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి;
وَصَٰحِبَتِهِۦ وَبَنِيهِ
Open ayah 80:36మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి;
لِكُلِّ ٱمۡرِيٕٖ مِّنۡهُمۡ يَوۡمَئِذٖ شَأۡنٞ يُغۡنِيهِ
Open ayah 80:37ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది.
وُجُوهٞ يَوۡمَئِذٖ مُّسۡفِرَةٞ
Open ayah 80:38ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి;
ضَاحِكَةٞ مُّسۡتَبۡشِرَةٞ
Open ayah 80:39అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి.
وَوُجُوهٞ يَوۡمَئِذٍ عَلَيۡهَا غَبَرَةٞ
Open ayah 80:40మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి.
تَرۡهَقُهَا قَتَرَةٌ
Open ayah 80:41అవి నల్లగా మాడిపోయి ఉంటాయి;
أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡكَفَرَةُ ٱلۡفَجَرَةُ
Open ayah 80:42అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు.