التكوير
At-Takwir
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِذَا ٱلشَّمۡسُ كُوِّرَتۡ
Open ayah 81:1సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు!
وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتۡ
Open ayah 81:2మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు!
وَإِذَا ٱلۡجِبَالُ سُيِّرَتۡ
Open ayah 81:3మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు!
وَإِذَا ٱلۡعِشَارُ عُطِّلَتۡ
Open ayah 81:4మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు!
وَإِذَا ٱلۡوُحُوشُ حُشِرَتۡ
Open ayah 81:5మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు!
وَإِذَا ٱلۡبِحَارُ سُجِّرَتۡ
Open ayah 81:6మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు!
وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتۡ
Open ayah 81:7మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు!
وَإِذَا ٱلۡمَوۡءُۥدَةُ سُئِلَتۡ
Open ayah 81:8మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు:
بِأَيِّ ذَنۢبٖ قُتِلَتۡ
Open ayah 81:9ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని?
وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتۡ
Open ayah 81:10మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు!
وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتۡ
Open ayah 81:11మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు!
وَإِذَا ٱلۡجَحِيمُ سُعِّرَتۡ
Open ayah 81:12మరియు నరకాగ్ని మండించబడినప్పుడు!
وَإِذَا ٱلۡجَنَّةُ أُزۡلِفَتۡ
Open ayah 81:13మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు!
عَلِمَتۡ نَفۡسٞ مَّآ أَحۡضَرَتۡ
Open ayah 81:14ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది.
فَلَآ أُقۡسِمُ بِٱلۡخُنَّسِ
Open ayah 81:15అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను;
ٱلۡجَوَارِ ٱلۡكُنَّسِ
Open ayah 81:16(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో!
وَٱلَّيۡلِ إِذَا عَسۡعَسَ
Open ayah 81:17మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా!
وَٱلصُّبۡحِ إِذَا تَنَفَّسَ
Open ayah 81:18మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా!
إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٖ كَرِيمٖ
Open ayah 81:19నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు!
ذِي قُوَّةٍ عِندَ ذِي ٱلۡعَرۡشِ مَكِينٖ
Open ayah 81:20అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!
مُّطَاعٖ ثَمَّ أَمِينٖ
Open ayah 81:21అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు!
وَمَا صَاحِبُكُم بِمَجۡنُونٖ
Open ayah 81:22మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు!
وَلَقَدۡ رَءَاهُ بِٱلۡأُفُقِ ٱلۡمُبِينِ
Open ayah 81:23మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు.
وَمَا هُوَ عَلَى ٱلۡغَيۡبِ بِضَنِينٖ
Open ayah 81:24మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు.
وَمَا هُوَ بِقَوۡلِ شَيۡطَٰنٖ رَّجِيمٖ
Open ayah 81:25మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు.
فَأَيۡنَ تَذۡهَبُونَ
Open ayah 81:26మరి మీరు ఎటు పోతున్నారు?
إِنۡ هُوَ إِلَّا ذِكۡرٞ لِّلۡعَٰلَمِينَ
Open ayah 81:27ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం.
لِمَن شَآءَ مِنكُمۡ أَن يَسۡتَقِيمَ
Open ayah 81:28మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు.
وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ
Open ayah 81:29మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.