الإنشقاق
Al-Inshiqaaq
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتۡ
Open ayah 84:1ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు!
وَأَذِنَتۡ لِرَبِّهَا وَحُقَّتۡ
Open ayah 84:2మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
وَإِذَا ٱلۡأَرۡضُ مُدَّتۡ
Open ayah 84:3మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;
وَأَلۡقَتۡ مَا فِيهَا وَتَخَلَّتۡ
Open ayah 84:4మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;
وَأَذِنَتۡ لِرَبِّهَا وَحُقَّتۡ
Open ayah 84:5అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
يَٰٓأَيُّهَا ٱلۡإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدۡحٗا فَمُلَٰقِيهِ
Open ayah 84:6ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.
فَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ
Open ayah 84:7అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి;
فَسَوۡفَ يُحَاسَبُ حِسَابٗا يَسِيرٗا
Open ayah 84:8అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.
وَيَنقَلِبُ إِلَىٰٓ أَهۡلِهِۦ مَسۡرُورٗا
Open ayah 84:9మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు!
وَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ وَرَآءَ ظَهۡرِهِۦ
Open ayah 84:10ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు;
فَسَوۡفَ يَدۡعُواْ ثُبُورٗا
Open ayah 84:11అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు;
وَيَصۡلَىٰ سَعِيرًا
Open ayah 84:12మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.
إِنَّهُۥ كَانَ فِيٓ أَهۡلِهِۦ مَسۡرُورًا
Open ayah 84:13వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.
إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ
Open ayah 84:14వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు.
بَلَىٰٓۚ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرٗا
Open ayah 84:15అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు.
فَلَآ أُقۡسِمُ بِٱلشَّفَقِ
Open ayah 84:16కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను!
وَٱلَّيۡلِ وَمَا وَسَقَ
Open ayah 84:17రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా!
وَٱلۡقَمَرِ إِذَا ٱتَّسَقَ
Open ayah 84:18పూర్ణచంద్రుని సాక్షిగా!
لَتَرۡكَبُنَّ طَبَقًا عَن طَبَقٖ
Open ayah 84:19మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.
فَمَا لَهُمۡ لَا يُؤۡمِنُونَ
Open ayah 84:20అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?
وَإِذَا قُرِئَ عَلَيۡهِمُ ٱلۡقُرۡءَانُ لَا يَسۡجُدُونَۤ۩
Open ayah 84:21మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు?
بَلِ ٱلَّذِينَ كَفَرُواْ يُكَذِّبُونَ
Open ayah 84:22అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.
وَٱللَّهُ أَعۡلَمُ بِمَا يُوعُونَ
Open ayah 84:23మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
فَبَشِّرۡهُم بِعَذَابٍ أَلِيمٍ
Open ayah 84:24కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు -
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونِۭ
Open ayah 84:25విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది.