الأعلى
Al-A'laa
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
سَبِّحِ ٱسۡمَ رَبِّكَ ٱلۡأَعۡلَى
Open ayah 87:1అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!
ٱلَّذِي خَلَقَ فَسَوَّىٰ
Open ayah 87:2ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.
وَٱلَّذِي قَدَّرَ فَهَدَىٰ
Open ayah 87:3మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు!
وَٱلَّذِيٓ أَخۡرَجَ ٱلۡمَرۡعَىٰ
Open ayah 87:4మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు.
فَجَعَلَهُۥ غُثَآءً أَحۡوَىٰ
Open ayah 87:5మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.
سَنُقۡرِئُكَ فَلَا تَنسَىٰٓ
Open ayah 87:6మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు -
إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ إِنَّهُۥ يَعۡلَمُ ٱلۡجَهۡرَ وَمَا يَخۡفَىٰ
Open ayah 87:7అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.
وَنُيَسِّرُكَ لِلۡيُسۡرَىٰ
Open ayah 87:8మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.
فَذَكِّرۡ إِن نَّفَعَتِ ٱلذِّكۡرَىٰ
Open ayah 87:9కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు!
سَيَذَّكَّرُ مَن يَخۡشَىٰ
Open ayah 87:10(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు.
وَيَتَجَنَّبُهَا ٱلۡأَشۡقَى
Open ayah 87:11మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు.
ٱلَّذِي يَصۡلَى ٱلنَّارَ ٱلۡكُبۡرَىٰ
Open ayah 87:12అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحۡيَىٰ
Open ayah 87:13అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు.
قَدۡ أَفۡلَحَ مَن تَزَكَّىٰ
Open ayah 87:14సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు.
وَذَكَرَ ٱسۡمَ رَبِّهِۦ فَصَلَّىٰ
Open ayah 87:15మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు.
بَلۡ تُؤۡثِرُونَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا
Open ayah 87:16అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;
وَٱلۡأٓخِرَةُ خَيۡرٞ وَأَبۡقَىٰٓ
Open ayah 87:17కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.
إِنَّ هَٰذَا لَفِي ٱلصُّحُفِ ٱلۡأُولَىٰ
Open ayah 87:18నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;
صُحُفِ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ
Open ayah 87:19ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.