الغاشية
Al-Ghaashiya
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
هَلۡ أَتَىٰكَ حَدِيثُ ٱلۡغَٰشِيَةِ
Open ayah 88:1హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా?
وُجُوهٞ يَوۡمَئِذٍ خَٰشِعَةٌ
Open ayah 88:2కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.
عَامِلَةٞ نَّاصِبَةٞ
Open ayah 88:3(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి,
تَصۡلَىٰ نَارًا حَامِيَةٗ
Open ayah 88:4వారు దహించే అగ్నిలో పడి కాలుతారు.
تُسۡقَىٰ مِنۡ عَيۡنٍ ءَانِيَةٖ
Open ayah 88:5వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.
لَّيۡسَ لَهُمۡ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٖ
Open ayah 88:6వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు.
لَّا يُسۡمِنُ وَلَا يُغۡنِي مِن جُوعٖ
Open ayah 88:7అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు!
وُجُوهٞ يَوۡمَئِذٖ نَّاعِمَةٞ
Open ayah 88:8ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి;
لِّسَعۡيِهَا رَاضِيَةٞ
Open ayah 88:9తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు.
فِي جَنَّةٍ عَالِيَةٖ
Open ayah 88:10అత్యున్నతమైన స్వర్గవనంలో.
لَّا تَسۡمَعُ فِيهَا لَٰغِيَةٗ
Open ayah 88:11అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు.
فِيهَا عَيۡنٞ جَارِيَةٞ
Open ayah 88:12అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి;
فِيهَا سُرُرٞ مَّرۡفُوعَةٞ
Open ayah 88:13అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి;
وَأَكۡوَابٞ مَّوۡضُوعَةٞ
Open ayah 88:14మరియు పేర్చబడిన (మధు) పాత్రలు;
وَنَمَارِقُ مَصۡفُوفَةٞ
Open ayah 88:15మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు;
وَزَرَابِيُّ مَبۡثُوثَةٌ
Open ayah 88:16మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు.
أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلۡإِبِلِ كَيۡفَ خُلِقَتۡ
Open ayah 88:17ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో?
وَإِلَى ٱلسَّمَآءِ كَيۡفَ رُفِعَتۡ
Open ayah 88:18మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో?
وَإِلَى ٱلۡجِبَالِ كَيۡفَ نُصِبَتۡ
Open ayah 88:19మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో?
وَإِلَى ٱلۡأَرۡضِ كَيۡفَ سُطِحَتۡ
Open ayah 88:20మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో?
فَذَكِّرۡ إِنَّمَآ أَنتَ مُذَكِّرٞ
Open ayah 88:21కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే!
لَّسۡتَ عَلَيۡهِم بِمُصَيۡطِرٍ
Open ayah 88:22నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు.
إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ
Open ayah 88:23ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో!
فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلۡعَذَابَ ٱلۡأَكۡبَرَ
Open ayah 88:24అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు.
إِنَّ إِلَيۡنَآ إِيَابَهُمۡ
Open ayah 88:25నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది;
ثُمَّ إِنَّ عَلَيۡنَا حِسَابَهُم
Open ayah 88:26ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే!