الليل
Al-Lail
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰ
Open ayah 92:1క్రమ్ముకునే రాత్రి సాక్షిగా!
وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ
Open ayah 92:2ప్రకాశించే పగటి సాక్షిగా!
وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ
Open ayah 92:3మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
إِنَّ سَعۡيَكُمۡ لَشَتَّىٰ
Open ayah 92:4వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి;
فَأَمَّا مَنۡ أَعۡطَىٰ وَٱتَّقَىٰ
Open ayah 92:5కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!
وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ
Open ayah 92:6మరియు మంచిని నమ్ముతాడో!
فَسَنُيَسِّرُهُۥ لِلۡيُسۡرَىٰ
Open ayah 92:7అతనికి మేము మేలు కొరకు దానిరి సులభం చేస్తాము.
وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسۡتَغۡنَىٰ
Open ayah 92:8కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో!
وَكَذَّبَ بِٱلۡحُسۡنَىٰ
Open ayah 92:9మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!
فَسَنُيَسِّرُهُۥ لِلۡعُسۡرَىٰ
Open ayah 92:10అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.
وَمَا يُغۡنِي عَنۡهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ
Open ayah 92:11మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?
إِنَّ عَلَيۡنَا لَلۡهُدَىٰ
Open ayah 92:12నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని!
وَإِنَّ لَنَا لَلۡأٓخِرَةَ وَٱلۡأُولَىٰ
Open ayah 92:13మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది.
فَأَنذَرۡتُكُمۡ نَارٗا تَلَظَّىٰ
Open ayah 92:14కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.
لَا يَصۡلَىٰهَآ إِلَّا ٱلۡأَشۡقَى
Open ayah 92:15పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు!
ٱلَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
Open ayah 92:16ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో!
وَسَيُجَنَّبُهَا ٱلۡأَتۡقَى
Open ayah 92:17కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు!
ٱلَّذِي يُؤۡتِي مَالَهُۥ يَتَزَكَّىٰ
Open ayah 92:18అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!
وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعۡمَةٖ تُجۡزَىٰٓ
Open ayah 92:19కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక;
إِلَّا ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِ ٱلۡأَعۡلَىٰ
Open ayah 92:20కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే!
وَلَسَوۡفَ يَرۡضَىٰ
Open ayah 92:21మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు.