القارعة
Al-Qaari'a
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
ٱلۡقَارِعَةُ
Open ayah 101:1ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం!
مَا ٱلۡقَارِعَةُ
Open ayah 101:2ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ
Open ayah 101:3మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?
يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ
Open ayah 101:4ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.
وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ
Open ayah 101:5మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.
فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ
Open ayah 101:6అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!
فَهُوَ فِي عِيشَةٖ رَّاضِيَةٖ
Open ayah 101:7అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.
وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ
Open ayah 101:8మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!
فَأُمُّهُۥ هَاوِيَةٞ
Open ayah 101:9అతని నివాసం అధః పాతాళమే.
وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ
Open ayah 101:10మరియు అది ఏమిటో నీకేం తెలుసు?
نَارٌ حَامِيَةُۢ
Open ayah 101:11అదొక భగభగమండే అగ్ని (గుండం).