الفلق
Al-Falaq
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ
Open ayah 113:1ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.
مِن شَرِّ مَا خَلَقَ
Open ayah 113:2ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
Open ayah 113:3మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో!
وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ
Open ayah 113:4మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
Open ayah 113:5మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"